: రేపు సాయంత్రం ఐదు గంటలకు కోర్ కమిటీ భేటీ
తెలంగాణ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతోపాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ విషయమై స్పష్టత వస్తుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణ విషయం మరోసారి జటిల మయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.