: సాంకేతిక లోపంతో గ్రీకు విమానం అత్యవసర ల్యాండింగ్
సాంకేతిక లోపంతో గ్రీకు విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. 170 మంది ప్రయాణీకులుతో జెరూసలెం నుంచి బయలుదేరిన విమానం టెల్ అవీవ్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నట్టు ఎయిర్ పోర్ట్ ప్రతినిధి మిక్కీ రోసెస్ ఫీల్డ్ పేర్కొన్నారు. అత్యవసర ల్యాండింగ్ సమాచారం అందగానే ఎయిర్ పోర్ట్ అధికారులు భారీగా అంబులెన్సులు, సహాయక సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బంది సంసిద్దులయ్యారు. ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.