: తెలంగాణ ప్రకటన చేస్తే మెరుపు సమ్మెకు దిగుతాం: ఏపీ ఎన్జీవోల హెచ్చరిక
తెలంగాణ అంశంపై చర్చించేందుకు రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అవనుండగా.. ఆ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూల ప్రకటన చేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్జీవోల సంఘం హెచ్చరించింది. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ నేడు హైదరాబాద్ లో మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించే పార్టీలతో సమైక్య సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఏ త్యాగానికైనా సిద్ధమే అని ఆయన స్పష్టం చేశారు.