: స్కూలు మూసేసి.. పిల్లలను జైలుకు తరలించిన అధికారులు


తిరుపతిలో రాజీవ్ విద్యామిషన్ పాఠశాలను ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు మూసివేశారు. స్కూలులో చదువుతున్న చిన్నారులను చిన్నపిల్లల జైలుకు తరలించారు. అధికారుల తీరుతో విద్యార్థుల తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఎలాంటి సమాచారమివ్వకుండా, తమ అనుమతి తీసుకోకుండా పిల్లలను ఎలా తరలిస్తారని అధికారులను అడుగుతున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలమేరకే పాఠశాలను మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు. మీకందిన నోటీసుల వివరాలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదా అంటూ అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News