: కండ్లకుంట పంచాయతీ ఉద్రిక్తం


గ్రామాల్లో పంచాయతీ నిప్పు రాజుకుంటోంది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో సర్పంచి అభ్యర్ధి ఎంపిక నేపథ్యంలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధిని వైఎస్సార్ సీపీకి చెందిన నేతలు పిలిపించి మాట్లాడడం వివాదానికి కారణమైంది. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో పోలీసులు మోహరించారు. కండ్లకుంట ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వగ్రామం కావడంతో ఈ పంచాయతీ ఎన్నికపై ఉత్కంఠ రేకెత్తుతోంది. కాగా డీఎస్పీ పూజ ప్రస్తుతం పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News