: ఆధార్ లేకున్నా.. సరైన చిరునామా ఉంటే సబ్సిడీ గ్యాస్ ఇస్తాం: మంత్రి పనబాక


సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ఆధార్ కార్డుతో ముడిపెట్టి, పలు విమర్శలకు గురైన ప్రభుత్వం తాజాగా ఊరటనిచ్చే ప్రకటన చేసింది. వినియోగదారులు ఆధార్ కార్డు లేకున్నా సరైన చిరునామా చూపితే సబ్సిడీ పొందవచ్చని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బుధవారం చెప్పారు. హైదరాబాదులో ఓ చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అదనపు గ్యాస్ కేటాయింపుల కోసం ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆధార్ కార్డుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఆధార్ కార్డులు చూపని వారికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు డీలర్లు నిరాకరిస్తుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News