: నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు


జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ లభించింది. దగ్గరి బంధువు ఒకరు చనిపోవడంతో సీబీఐ న్యాయస్థానం నిమ్మగడ్డకు 13 రోజులపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు షరతుల ప్రకారం.. బెయిల్, ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలవరకే వర్తిస్తుంది. కాగా, బెయిల్ వ్యవధిలో నిమ్మగడ్డ కేవలం కుటుంబసభ్యులతో మాత్రమే సంభాషించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News