: ప్రముఖ సంగీత విద్వాంసుడు 'నూకల' కన్నుమూత
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు నూకల చినసత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నూకల ఈ ఉదయం సికింద్రాబాద్ లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు కళాకారులు సంతాపం తెలియజేశారు. శాస్త్రీయ సంగీతం పట్ల ఎంతో అనురక్తి ప్రదర్శించే నూకల సంగీతంపై 12 పుస్తకాలను రచించారు. ఈయన విజయనగరం, తిరుపతి, హైదరాబాద్ సంగీత కళాశాలలకు ప్రిన్సిపాల్ గా కూడా వ్యవహరించారు. ప్రముఖ గాత్ర విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రిగారైన పట్టాభిరామయ్య వద్ద నూకల సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.