: పలు అంశాలపై కోర్ కమిటీలో కాంగ్రెస్ అంతర్మథనం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈమేరకు ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ కోర్ కమిటీ, విపక్షాల నుంచి ఎదురయ్యే సమస్యలను అధిగమించే వ్యూహాలపై చర్చించింది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు నడిపే తీరుపై పరిశీలించింది.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్ పాతగాయం కొత్తగా బయటికొచ్చి ఇరకాటంలో పెడుతున్నఅంశాన్ని మరింత సీరియస్ గా తీసుకుంది. సమావేశాల్లో దీనిపై బీజేపీ సహ ఇతర పార్టీలు ఎటువంటి ప్రశ్నలు సంధించినా సమాధానానికి సిద్ధంగా ఉండాలని ధైర్యం నూరిపోసుకుంది. ఇక దేశ ప్రముఖులకు ఉపయోగించే ‘అగస్టా వెస్ట్ లాండ్’ హెలికాప్టర్ల అవినీతిలో భారత్, ఇటలీల మకిలిపై దీటుగా స్పందించాలని భేటీలో నిర్ణయించారు. యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ఆర్ధిక మంత్రి చిదంబరం, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.