: హృతిక్ ను పరామర్శించిన కత్రినాకైఫ్
ప్రియమిత్రుడు రణబీర్ కపూర్ తో కలిసి స్పెయిన్ లో విహారం చేసి వచ్చిన కత్రినా కైఫ్ సహ నటుడు హృతిక్ రోషన్ ను గతరాత్రి పరామర్శించింది. విదేశీ పర్యటన ముగించుకుని ముంబైలో అడుగుపెట్టిన వెంటనే కత్రినా హిందుజా ఆస్పత్రికి వెళ్లి హృతిక్ ను పరామర్శించింది. అతడి భార్య సుజానే రోషన్ నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. హృతిక్, కత్రినా కలిసి 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం షూటింగ్ సెట్లోనే హృతిక్ మెదడులో రక్తస్రావం అయింది. దీంతో అతడు రెండు రోజుల క్రితం హిందుజా ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నాడు.