: షేన్ వార్న్ కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం


ఆస్ట్రేలియా వెటరన్ బౌలర్ షేన్ వార్న్ కు తగిన గౌరవం లభించింది. ఐసీసీ ప్రతిష్ఠాత్మక క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం కల్పించింది. క్రికెట్ ప్రపంచంలో విలువైన సేవలు అందించిన ఆటగాళ్లకు ఇందులో సభ్యత్వం కల్పిస్తారు. దీనిని ఒక గౌరవనీయ పురస్కారంగా భావిస్తారు. ఈ నెల లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ టీ విరామ సమయంలో వార్న్ పేరును క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో నమోదు చేస్తారు. క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 69వ క్రికెటర్ షేన్ వార్న్. 1992 నుంచి 2007 వరకు షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టు మ్యాచులు ఆడి 708 వికెట్లను తీసుకున్నాడు. అలాగే, 194 వన్డే మ్యాచులు ఆడి 293 వికెట్లను తీసుకున్నాడు.

  • Loading...

More Telugu News