: మీ తలపై 20వేల అప్పు!


ఎక్కడా చేయి చాచకుండా ఉన్నంతలో గౌరవంగా బతుకుతున్నారా? హమ్మయ్య... కడుపు నిండకపోయినా పర్లేదు, పరాయి వాడికి బాకీ లేను కదా.. అంటూ నిశ్చింతగా నిద్రపోతున్నారా? మీరు ఉలిక్కిపడే విషయం చెప్పాలి... అదే మీ తలపై అప్పు 20వేల రూపాయలకు చేరుకుంది. అదేంటి...? నేనెప్పడూ ఎవ్వరి దగ్గరా అప్పు కోసం చేయి చాచి ఎరుగనే.. అని మండిపడుతున్నారా? కాస్త నీరు తాగండి, అసలు విషయం చెబుతాం.. విందురు గానీ..

మీ తలపై అప్పు ఉందన్నాం కానీ, మీరు చేశామని చెప్పలేదు కదా. ఇదంతా మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాలు 1.73 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అంటే సగటున చూస్తే.. పౌరులు తల ఒక్కింటికీ 20వేల పైనే అప్పు ఉన్నట్లు లెక్క!

ఇవి రిజర్వ్ బ్యాంకు అంచనాలు. సర్కారు అప్పు చేస్తే నేను చేసినట్లు ఎలా అవుతుందీ...? అని అనుకోకండి. అదంతా పన్నుల రూపంలో మన దగ్గర పిండి పైకంగా కట్టించుకుంటారు మరి. రానున్న ఆర్థిక సంవత్సరంలో మరి కొన్ని వేల కోట్ల రూపాయలను అప్పుచ్చుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అంటే, మీ తలపై అప్పు భారం మరింత పెరగనుందన్నమాట. తస్మాత్ జాగ్రత్త!

  • Loading...

More Telugu News