: టైటిల్ సాధనకు ఒక్కడుగు దూరంలో టీమిండియా
టీమిండియా టైటిల్ సాధనకు ఒక్కడుగు దూరంలో నిలిచింది. నేడు జరుగనున్న ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు, శ్రీలంకతో తలపడనుంది. దారుణ ఓటములతో ప్రారంభించిన టీమిండియా తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ట్రైసిరీస్ లో అసలు ఫైనల్ కు చేరుతుందో, లేదో అనేలా తొలి రెండు వన్డేలు ఆడిన భారత జట్టు, తరువాత పుంజుకుని బోనస్ పాయింట్లతో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. దీంతో వరుణుడు అడ్డుకున్నా ప్రత్యర్ధులపై తమ ఆటతీరుతో పైచేయి సాధించారు. దీంతో నేడు టైటిల్ పోరులో టీమిండియా, శ్రీలంకతో తలపడనుంది. టీమిండియా ఈ ట్రైసిరీస్ ను గెలిచి మరో టైటిల్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.