: అథ్లెట్ పై లైంగిక వేధింపులు.. దాడి


జాతీయ స్థాయి పరుగుపందెం క్రీడాకారిణిపై ఉత్తరప్రదేశ్ లో దాడి జరిగింది. సహరాన్ పూర్ లో బుధవారం ఉదయం ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆ యువతి దగ్గరకు ఐదుగురు యువకుల మూక కారులో వచ్చి లైంగిక వేధింపులకు దిగింది. సహచర అథ్లెట్లు యువకుల దుష్ప్రవర్తనను ప్రశ్నించడంతో.. 18ఏళ్ల ఆ యువతిపై నుంచి కారును పోనిచ్చారు. దీంతో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది. అనంతరం సహచరులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News