: హెడ్‌ఫోన్స్‌తో సెల్‌ ఛార్జింగ్‌


మామూలుగా అయితే హెడ్‌ఫోన్స్‌తో మనం ఏం చేస్తాం... చక్కగా పాటలు వింటూ ఆనందిస్తాం. అయితే ఈ ఆనందంతోబాటు మన సెల్‌ఫోన్‌ను కూడా రీఛార్జి చేసుకోవచ్చు అంటున్నారు. ఎందుకంటే, ఈ కొత్తరకం హెడ్‌ఫోన్లు మన సెల్‌ని కూడా రీఛార్జి చేసేస్తాయట. అది కూడా కరెంటుతోకాదు... సౌరశక్తితో!

ఇంగ్లండుకు చెందిన ఆండ్రూ అండర్సన్‌ అనే ఒక సౌండ్‌ ఇంజనీర్‌ సౌరశక్తిని గ్రహించే ఒక హెడ్‌ఫోన్‌ సెట్‌ని తయారు చేశారు. వీటితో చక్కగా మనం పాటలు వింటూ ఆనందించడమే కాదు, మన మొబైల్‌ని కూడా రీఛార్జ్‌ చేసుకోవచ్చని ఆండ్రూ చెబుతున్నాడు. సౌరశక్తితో పనిచేసే ఈ కొత్తరకం హెడ్‌ఫోన్లకు 'ఆన్‌-బీట్‌' అనే పేరు పెట్టాడు. వీటిని తయారు చేయడానికి బ్యాండ్‌లో ఫ్లెక్సిబుల్‌గా ఉండే సౌరశక్తి ఫలకాలను వాడాడు. ఈ ఫలకాల సామర్ధ్యం 0.55 వాట్స్‌ వరకూ ఉంటుంది. సౌరశక్తితో ఉత్పత్తి అయిన విద్యుచ్ఛక్తిని నిల్వ ఉంచేందుకు లిథియం ఐయాన్‌ బ్యాటరీను ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీలు రెండూ హెడ్‌కప్స్‌లో ఉంటాయి. అయితే వానాకాలం ఎలా అంటే మీ కంప్యూటర్‌కున్న యూఎస్‌బీ లేదా మామూలు కరెంటు సాకెట్‌తో మన హెడ్‌ఫోన్‌లను ఛార్జ్‌ చేసుకునే వీలు కల్పించారు.

  • Loading...

More Telugu News