: జపాన్‌లో డైనోసార్లుండేవట!


జురాసిక్‌ పార్క్‌ చిత్రం డైనోసార్‌ అంటే ఏమిటి అనేది చక్కగా తెరపై చూపింది. దీంతో డైనోసార్ల గురించి తెలియని వారికి చాలామందికి తెలిసింది. వీటిలో మాంసాహారులైన డైనోసార్లు ఒకప్పుడు జపాన్‌లో సంచరించి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే, వారికి ఇలాంటి డైనోసార్‌కు సంబంధించిన రెండు దంత శిలాజాలు లభించాయి. దీంతో జపాన్‌లో డైనోసార్లు సంచరించి ఉండవచ్చని చెబుతున్నారు.

జపాన్‌లోని పుకుయ్‌ ప్రిఫెక్చురల్‌ డైనోసార్‌ మ్యూజియం, నాగసాకి సిటీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు ఒక రాక్షస బల్లికి చెందిన రెండు దంత శిలాజ భాగాలను గుర్తించినట్టు తెలిపారు. ఈ దంత శిలాజాలు ఏడు మీటర్లకు పైగా ఎత్తు ఉండవచ్చని భావిస్తున్న ఒక మాంసాహార రాక్షసబల్లికి చెందినవిగా పరిశోధకులు భావిస్తున్నారు. అయితే కేవలం ఈ భాగాల ద్వారానే ఈ జీవిని గుర్తించడం కష్టమని, ఇప్పటి వరకూ ఇలాంటి మాంసాహార రాక్షసబల్లికి సంబంధించిన దంత శిలాజాన్ని జపాన్‌లో గుర్తించలేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News