: రాజీవ్ హంతకుడికి చుక్కెదురు
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన పెరారివలన్ కు చుక్కెదురైంది. తనకు క్షమాభిక్ష నిరాకరించడానికి కారణాలేమిటని సమాచార హక్కు చట్టం కింద ఆయన దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర హోం శాఖ.. భారత రాజ్యాంగ పరిధిని సమాచార హక్కు చట్టం అతిక్రమించలేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు చెప్పిన విషయాన్ని ఉటంకించింది.