: పవిత్ర రంజాన్ మాసం రేపటి నుంచి ఆరంభం


ముస్లిం సోదరులకు అతి పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. మానవాళి సంక్షేమం కోసం రూపొందిన పవిత్ర గ్రంధం ఖురాన్ అవతరించిన విశేష మాసమిది. ముస్లింలు ఈ మాసాన్ని అత్యంత ప్రీతిపాత్రమైన, పవిత్ర మాసంగా భావిస్తారు. బుధవారం నెలవంక కన్పించడంతో ఈ నెల ప్రారంభం కానుంది. రంజాన్ నెల సందర్భంగా వందలాది మసీదులకు రంగులు వేసి ముస్తాబు చేశారు. రోజూ ముస్లింలకు ఉదయం, సాయంత్రం ఇఫ్తార్ వేళలను తెలియజేసేందుకు వీలుగా అన్ని మసీదులవద్ద సైరన్ లను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News