: కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో టీమిండియా అండర్ 19 జట్టు కివీస్ ను చిత్తు చేసింది. వరుసగా నాలుగు విజయాలు సాధించి మంచి ఊపు మీద టీమిండియా జట్టు ఫైనల్లో ఆసీస్ తో తలపడనుంది. ఇప్పటికే ఫైనల్ కు అర్హత సాధిచిన భారత్ అండర్ 19 జట్టు, తాజా విజయంతో తనకు తిరుగులేదని నిరూపించింది. నిప్పులు చెరిగే బంతులతో 119 పరుగులకే కివీస్ బ్యాట్స్ మన్ ను చుట్టేసిన బ్లూబాయ్స్, 24 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సాధించి సత్తా చాటింది. భారత్ సాధించిన 123 పరుగుల్లో కెప్టన్ విజయ్ జోల్ 46, హెర్వాడ్కర్ 25, శామ్సన్ 23 పరుగులు సాధించారు. 12 వ తేదీన ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి భవిష్యత్ తారలు సీనియర్లకు దీటుగా తాము ఆడతామని రుజువు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.