: 15 కేజీల బియ్యానికి 15 కిలోమీటర్ల నడక


వరదల బారినపడిన ఉత్తరాఖండ్ ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. కేవలం 15 కేజీల రేషన్ బియ్యం అందుకునేందుకు 15 కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు ఉత్తరాఖండ్ వరదబాధితులు. గత నెల రోజులుగా భారీ వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంఘం చెట్టి, ఉత్తర కాశీ, రాశి గంగ, అశి గంగా ప్రాంతాలలోని ప్రజలు ప్రమాదకరమైన కొండచరియలను, నదులను దాటుకుని రేషన్ బియ్యం కోసం ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికీ వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో తెరిపిస్తున్న ఆ కాస్త సమయంలోనే పంచాయతీలలోని రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో గిరిజనం పది, ఇరవై ఇళ్లు కలిసి ఓ కుగ్రామంగా ఉంటారు. కొన్ని గ్రామాలకు కలిపి ఓ పంచాయతీ ఉంటుంది. ఈ పంచాయతీలకు కూడా రేషన్ సరుకులు సరఫరా మార్గం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News