: రాష్ట్రానికి భారీ వర్షసూచన
రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఖరీఫ్ సీజన్ లో ఇప్పటికీ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. ఒక్క హైదారాబాద్ మినహా రాష్ట్రం మొత్తం వర్షాభావం ఏర్పడింది. తాజాగా వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.దీని ప్రభావం వల్ల క్యుములో నింబస్ మేఘాలు కొన్ని ప్రాంతాలను కమ్ముకున్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.