: చంద్రబాబుకు లక్ష్మీపార్వతి ఘాటు లేఖ


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి లక్ష్మీపార్వతి నేడు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. రాష్ట్ర విభజన ఉద్యమాలు చంద్రబాబు అనుసరించిన విధానాల ఫలితమే అని ఆరోపించారు. తెలుగుజాతి రెండు ముక్కలవుతుంటే టీడీపీ మౌనం దాల్చడం వెనక అంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కైన బాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని తన లేఖలో విమర్శించారు. ఎన్టీఆర్ పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనించిందన్న లక్ష్మీపార్వతి.. బాబు హయాంలో అధోగతిపాలైందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బాబు పార్టీ విధానాలకు అనుగుణంగా సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని సూచించారు.

  • Loading...

More Telugu News