: జీవిత బీమాపై ప్రజల్లో అవగాహన అవసరం: కేంద్ర మంత్రి
జీవిత బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ మీనా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఆసియా ఫోరమ్ ఫర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ ఎనిమిదో సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాల్లో ఇన్సూరెన్స్ రంగం దివాలా తీసిందని, కానీ భారత్ లో మాత్రం ఆ పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. మనదేశ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఆసియాలో ఇప్పుడిప్పుడే మధ్య తరగతి సమాజం అభివృద్ధి చెందుతోందని, అంతర్జాతీయంగా వీరికి ఇన్సూరెన్స్ సంస్ధలు చేయూతనివ్వాలని కోరారు. ఉత్తరాఖండ్ తరహా ప్రకృతి విపత్తులొచ్చినప్పుడు భీమా సంస్ధలు ఇతోధికంగా సహాయపడాలని సూచించారు. ఈ సమావేశంలో 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.