: యుక్తాముఖిది విచిత్ర మనస్తత్వం: అత్తింటివారు


యుక్తాముఖిది విచిత్ర మనస్తత్వం అని మాజీ ప్రపంచ సుందరి అత్తంటివారు ఆరోపిస్తున్నారు. యుక్తాపై గృహ హింసకు పాల్పడ్డారన్న కేసులో అరెస్టయిన ఆమె అత్త, మామలు, ఆడపడుచులు ఒక్కొక్కరు 25,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెళ్లయిన నాటి నుంచి తమను తమ కుమారునికి దూరం చేయాలని యుక్తాముఖి చూసిందని, మనవడ్ని అస్సలు ముట్టుకోనిచ్చేది కాదని, పొరపాటుగా ముట్టుకున్నా శుభ్రంగా చేతులు కడుక్కుని ముట్టుకోవాలని అడిగేదని, ముందుగానే కడుక్కున్నా తన కళ్ల ముందు కడుక్కోవాలని సూచించేదని, తమ కుమారుడు తమవైపు చూడడాన్ని కూడా సహించేది కాదని తెలిపారు. పెళ్లికి ముందే ఆమె గురించి పూర్తిగా తెలుసుకుని పెళ్లికి ఒప్పుకోవాలని ఓ వ్యక్తి సూచించాడని, అయితే దాన్ని నిర్లక్ష్యంచేసి ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నారు. యుక్తాముఖి తన కుమారుడితోపాటు ఏడాదిగా ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది.

  • Loading...

More Telugu News