: రాజస్థాన్ సీఎం ఫేస్ బుక్ 'లైక్స్' కొనేశాడా..?


రాజకీయ నాయకులు ఓట్లను కొనేయడం తెలిసిందే. కానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఫేస్ బుక్ 'లైక్స్' నూ కొనేశాడన్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నెటిజన్ల మధ్య తన పాప్యులారిటీ పెంచుకునేందుకే కాంగ్రెస్ సీఎం గెహ్లాట్ ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటాడని బీజేపీ ఆరోపించింది. జూన్ నెలాఖరునాటికి ఆయన 'లైక్స్' సంఖ్యలో విపరీతమైన పెరుగుదల కనిపించిందని రాజస్థాన్ బీజేపీ నేత జ్యోతి కిరణ్ వెల్లడించారు. వాటిలో అత్యధికంగా టర్కీ నగరం ఇస్తాంబుల్ నుంచి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రాబల్యం పెంచుకోవడం కోసం ఇంత దిగజారాల్సిన అవసరంలేదని కిరణ్ వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించింది. గతంలో నరేంద్ర మోడీ కోసం 'లైక్స్' ను కొన్నారు కాబట్టే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రతిదాడికి దిగింది.

  • Loading...

More Telugu News