: నిలువ నీడ లేదు... అయినా అనుకున్నది సాధించా: జెన్నీఫర్ లోపెజ్


కెరీర్ ఆరంభంలో నిలువ నీడ లేక స్టూడియోలోనే గడిపిన రోజులు ఉన్నాయని ప్రముఖ గాయని, హాలీవుడ్ నటి జెన్నీఫర్ లోపెజ్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. లండన్ లో షో ఇచ్చేందుకు వచ్చిన సందర్భంగా తన అనుభవాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. తను కాలేజీకి వెళ్లేందుకు ఇష్టపడే దానిని కాదని, అంతకంటే డాన్స్ క్లాస్ కి వెళ్లేందుకు ప్రాముఖ్యతనిచ్చేదాన్నని తెలిపారు. తన తల్లికి తను బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఉండేదని, దీంతో ప్రతి రోజూ తమ మధ్య గొడవలు జరిగేవని అన్నారు. చివరికి తల్లి నుంచి దూరంగా వెళ్లిపోయి డాన్స్ స్టూడియోలోని సోఫాలోనే పడుకునేదానినని తనకు కష్టంగా గడిచిన రోజులను గుర్తు చేసుకున్నారు.

కొన్ని నెలల తరువాత డాన్సింగ్ స్టూడియోలో ఉద్యోగం రావడంతో, దానికోసమే తన తల్లిని వదులుకున్నానని ఆమెకు తెలిపానని చెప్పారు. ఆ తరువాత తన మకాం లాస్ ఏంజిల్స్ కు మార్చానని తెలిపారు. మొదట్లో ఇక్కడ తనకు నచ్చేది కాదన్న జేలో, ఇప్పుడు లాస్ ఏంజిల్స్ తప్ప మరో నగరం తనకు నచ్చడం లేదని చెప్పింది. తన బిడ్డలైన మ్యాక్స్, ఎమ్మీలతో ప్రస్తుతం జెన్నీఫర్ లోపెజ్ అక్కడే నివాసం ఉంటోంది.

  • Loading...

More Telugu News