: అమెరికాలో చిదంబరం
నాలుగు రోజుల పర్యటన కోసం భారత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం అమెరికా చేరుకున్నారు. ఇక్కడి వాషింగ్టన్ విమానాశ్రయంలో నేడు ఆయనకు సాదర స్వాగతం లభించింది. చిదంబరం తన పర్యటనలో భాగంగా యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ 38వ నాయకత్వ సదస్సులో ఉపన్యసించనున్నారు. అనంతరం అమెరికా ఆర్ధిక మంత్రి జాక్ ల్యూతోనూ, కార్పొరేట్ దిగ్గజాలతోనూ, అమెరికా విధాన నిర్ణేతలతోనూ భేటీ అవనున్నారు. కాగా, ఆరు నెలల వ్యవధిలో చిదంబరం అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి.