: పురందేశ్వరి నిర్ణయం ఏమై ఉంటుంది?


కేంద్ర మంత్రి పురందేశ్వరి హస్తినలో నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశంపై తన పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు ఆయనతో చెప్పారు. ఆ నిర్ణయాన్నే పునరుద్ఘాటిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. అయితే, చిన్నమ్మ నిర్ణయం.. 'సమైక్యరాగమా? విభజనకు మద్దతా?' అనేది తెలియరాలేదు. కానీ, ఎల్లుండి ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కోర్ కమిటీ సమావేశంలో తన అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని పురందేశ్వరి.. దిగ్విజయ్ కు చెప్పారు. దిగ్విజయ్ తో భేటీ అనంతరం ఈమేరకు ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. సమైక్యాంధ్రపై స్పష్టమైన నిర్ణయం వెలిబుచ్చనందుకు నిరసనగా పురందేశ్వరికి నిన్న సమైక్యాంధ్ర జేఏసీ చీర పంపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News