: వివాదంపై పెదవి విప్పిన చాముండేశ్వరీ నాధ్
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి చాముండేశ్వరీ నాధ్ అన్నారు. సచిన్ దగ్గరకు మహిళా క్రీడాకారులు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళితే... ఈ సంఘటనని వివాదాలకు వాడుకుంటున్నారని చాముండేశ్వరీ నాధ్ ఆరోపించారు. తాను ఎలాంటి వాడినో సచిన్ కు తెలుసని... సచిన్ ఎలాంటి వాడో ప్రపంచానికి తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
తనపై బురద జల్లేందుకే గోకరాజు గంగరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేసారని చాముండేశ్వరీ నాధ్ అన్నారు. ఈ వ్యవహరాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన అన్నారు. ఏసీబీ కేసుతో చిక్కుల్లో ఉన్న గోకరాజు, సచిన్ తో తన సాన్నిహిత్యం చూసి ఈర్ష్యతోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని చాముండీ ఆరోపించారు.