: ఇది మరో జన్మ... కొత్త సవాళ్లతో సాగిపోతా: మనీషా కోయిరాలా
ఓవేరియన్ క్యాన్సర్ తో చావు అంచుల వరకూ వెళ్లి, 6 నెలలు పోరాడి విజయం సాధించిన బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా తనకిది మరో జన్మ అని, ఇక కొత్త సవాళ్లతో సాగిపోతానని తెలిపింది. ముంబైలోని తన వెర్సోవా హోమ్ లో సినిమాలు చూస్తూ, స్థానిక షాపుల్లో ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కుంటూ, ముంబై వర్షాకాలాన్ని ఉల్లాసంగా ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపేస్తోంది. నరకం నుంచి క్షేమంగా బయటపడ్డానని, ఇకపై కాస్త జాగ్రత్తగా, మరింత ఆశావహంగా జీవితాన్ని ఆరంభిస్తానని మనీషా తెలిపింది. జీవితం విలువ తెలిసిందని, ఇకపై దానిని మరింత ఆనందంగా మలచుకుంటానని మనీషా కోయిరాలా అంటోంది.