: త్వరలో ముంబైలో బాంబులు పేలుస్తాం: ఇండియన్ ముజాహిదీన్


బుద్ధగయలో బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని, త్వరలో ముంబైలో కూడా బాంబు పేలుళ్లు జరుపుతామని, దమ్ముంటే కాచుకోవాలని ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పోలీసులకు సవాలు విసిరింది. బుద్ధగయలో బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను హోం మంత్రి షిండే, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేలుళ్లపై ముందుగానే సమాచారాన్ని అందించామని, అయితే రాష్ట్రప్రభుత్వం వాటిని అడ్డుకోవడంలో విఫలమైందని అన్నారు. పేలుళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ నేపధ్యంలో ఇండియన్ ముజాహిదీన్ పేరిట ట్విట్టర్లో వచ్చిన పోస్టులపై దర్యాప్తు చేశారని అవి కెనడా నుంచి వచ్చినట్టు తెలిపారు. పేలుళ్ల కేసులో అనుమానితుల ఫొటోలను విడుదల చేసిన పోలీసులు, నిన్న అదుపులోకి తీసుకున్న అనుమానితులను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News