: సీమాంధ్ర పోలీసులు వేధిస్తున్నారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్ రెడ్డి, ఓదేలు, పలువురు ఈ ఉదయం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈనెల 24న నిర్వహించనున్న సడక్ బంద్ ను అడ్డుకునే యత్నాల్లో భాగంగా.. మహబూబ్ నగర్ జిల్లా వాసులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆమెకు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు, తమ విజ్ఞప్తిపై హోంమంత్రి సబిత సానుకూలంగా స్పందించారని, సాయంత్రం సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. జాతీయ రహదారిపై విధుల్లో ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు స్థానికులను బైండోవర్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఆరోపించారు.