: పంచాయతీ ఎన్నికలకు, తెలంగాణ వాదానికి సంబంధం లేదు: గుత్తా
పంచాయతీ ఎన్నికలకు, తెలంగాణ వాదానికి సంబంధమే లేదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు నల్గొండలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి సీమాంధ్ర నేతలే కారణమన్నారు. స్థానిక ఎన్నికల్లో తెలంగాణ వాదులకు ఓట్లెయ్యాలని జేఏసీ కన్వీనర్ కోదండరాం పిలుపునివ్వడంలో అర్ధం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ యూటర్న్ తీసుకోవడం సమంజసం కాదని, ఒక ప్రాంత సంతృప్తి కోసం అలా మాట్లాడకూడదని ఎంపీ గుత్తా అభిప్రాయపడ్డారు.