: హైదరాబాదులో పెద్ద ఎత్తున పురాతన భవనాల కూల్చివేత


సికింద్రాబాద్ సిటీలైట్ హోటల్ కూలిన ఘటనతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో చలనం వచ్చింది. ఇన్నాళ్లూ పురాతన, శిధిల భవనాల విషయంలో చూసీ చూడనట్లుగా వెళ్లిన అధికారులు సిటీలైట్ ప్రమాదంలో 17 మంది మరణించడాన్ని సీరియస్ గా తీసుకుని చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనూ సమీక్షా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నగరంలోని కాప్రా సర్కిల్ లో పురాతన భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 35 పురాతన భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వారం రోజుల్లో వీటన్నింటినీ కూల్చివేసేందుకు అధికారులు ప్రణాళిక వేసుకుని... దానిని నేటి నుంచీ అమలు చేస్తున్నారు. అలాగే, చింతల్ బస్తీ, గన్ ఫౌండ్రీ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లో కూడా శిధిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేస్తున్నారు.

  • Loading...

More Telugu News