: టీమిండియా లక్కీ.. ఫైనల్లో చోటు


భారత క్రికెట్ జట్టు నిన్న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో శ్రీలంకపై గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. అయితే, ఈ విజయం డక్ వర్త్ లూయిస్ విధానంలో వచ్చింది కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 29 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. వరుణుడు ఆటకు మూడున్నర గంటలపాటు అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ విధానాన్ని అమలు చేశారు. దీని ప్రకారం ఆటను 26 ఓవర్లకు కుదించి శ్రీలంక ముందు 178 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచారు. భారీ లక్ష్యం కళ్లముందు ఉండడంతో ఒత్తిడిలో శ్రీలంక జట్టు 24.4ఓవర్లకు అన్ని వికెట్లనూ కోల్పోయి చేతులెత్తేయడంతో భారత్ సగర్వంగా ఫైనల్స్ కు వెళ్లింది. ఆదిత్య జట్టు విండీస్ సిరీస్ నుంచి నిష్క్రమించింది. 4 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రేపు జరిగి ఫైనల్స్ లో మళ్లీ శ్రీలంక, భారతే తలపడతాయి.

  • Loading...

More Telugu News