: అంధుల కోసం చూసే చెవులు!


చూసే కళ్లు వినలేవు... చెప్పే నోరు చూడలేదు... అలాగే వినే చెవులు చూడలేవు... అయితే వినే చెవులు చూడగలిగితే... చాలా చిత్రంగా ఉంటుంది కదూ... ఇప్పుడు ఇలా చెవులకోసం చూసే పరికరాన్ని సృష్టించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వాతావరణంలోని శబ్ధాలతో చిత్రాన్ని రూపొందించేలా ఒక పరికరాన్ని శాస్త్రవేత్తలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అంధులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడలేరు. అలాంటి వారికోసం ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేసేందుకు బ్రిటన్‌లోని బాత్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు కృషి చేస్తున్నారు. అంధులు తమ చుట్టూ ఉండే పరిసరాల్లోని వాతావరణంలో ఉత్పన్నమయ్యే శబ్ధాలను గ్రహించి మనసులో ఒక చిత్రాన్ని రూపొందించుకునేలా ఈ పరికరం తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 'వాయిస్‌ సెన్సరీ సబ్‌స్టిట్యూషన్‌ డివైజ్‌' అనే పేరుతో పిలవబడే ఈ పరికరం శబ్ధాలను చిత్రాలుగా రూపొందించుకునే దిశగా అంధుల మెదడుకు శిక్షణనిస్తుందని పరికరం సృష్టికర్తలో ఒకరైన ప్రౌల్స్‌ చెబుతున్నారు. అంధులు, పాక్షికంగా చూడగలిగి వారు ఇన్‌వేజివ్‌ చికిత్సకు ప్రత్యామ్నాయంగా కూడా దీన్ని ఉపయోగించవచ్చని ప్రౌల్స్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News