: ప్రజలు గుజరాత్ తరహా పాలన కోరుతున్నారు: వెంకయ్య నాయుడు
దేశ ప్రజలు యూపీఏ పాలన పట్ల విసిగిపోయారని, గుజరాత్ తరహా పాలన కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు అన్నారు. మంగళగిరిలో నేడు ప్రజా చైతన్య సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యూపీఏ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. ధరలకు రెక్కలొచ్చాయని, ముఖ్యంగా 33 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయని వెల్లడించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇష్టారాజ్యంగా హామీలు గుప్పిస్తోందని ఆరోపించారు. గెలుస్తామో, లేదో అన్ని భయంతో పడరానిపాట్లు పడుతోందని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. గ్రామాలకు కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పడం ఎన్నికల కోసమే అని పేర్కొన్నారు.