: మ్యాచ్ కు వరుణుడి బ్రేక్
భారత్, శ్రీలంక మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న ముక్కోణపు టోర్నీ చివరి లీగ్ మ్యాచ్ లో వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 29 ఓవర్లలో 3 వికెట్లకు 119 పరుగులు చేసిన తరుణలో వర్షం అడ్డుతగలడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. పోరు నిలిచిపోయే సమయానికి క్రీజులో రోహిత్ శర్మ (48 బ్యాటింగ్), రైనా (4 బ్యాటింగ్) ఉన్నారు. లంక స్పిన్నర్ హెరాత్ 2 వికెట్లు తీశాడు.