: రాష్ట్రం సమైక్యంగా ఉండాలి... వాదం మార్చిన బొత్స
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సడెన్ గా సమైక్యవాణి వినిపించారు. బొత్స నోట సమైక్య మాటా.. అంటూ రాజకీయ నాయకులంతా ఆశ్చర్యపోయేలా శ్రీవారి సన్నిధిలో తాను సమైక్యవాదినంటూ తెలంగాణ వాదుల స్పీడ్ కు బ్రేక్ వేశారు. తిరుపతికి సకుటుంబ సపరివార సమేతంగా శ్రీవారి దర్శనార్ధం వచ్చిన మంత్రి వర్యులు రాష్ట్రం సమైక్యంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. అయినప్పటికీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానన్నారు. రాష్ట్ర విభజన జరిగినా వ్యతిరేకించనన్నారు. కేవలం పదవులకోసం తెలంగాణ ఏర్పడుతుందంటే తానిప్పటికిప్పుడే పీసీసీ అధ్యక్ష పీఠం త్యాగం చేయడానికి వెనుకాడనన్నారు. రాష్ట్ర పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక అందించేందుకు తానెప్పుడూ సిద్దంగా ఉంటానన్నారు. మొన్నటి వరకూ బొత్స కూడా తెలంగాణ వాదే అన్న తెలంగాణ వాదులకు బొత్స ఈ రకంగా ఝలకివ్వడానికి కారణమేంటో ఆయనే సెప్పాలి!