: అర్థిక ఇబ్బందుల్లో విక్రమ్ సేథ్ 'ఎ సూటబుల్ గర్ల్'
భారతీయ నవలా రచయిత విక్రమ్ సేథ్ ప్రచురణకర్తలతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రకారం తీసుకున్న అడ్వాన్సు తిరిగి ఇవ్వాల్సివచ్చేలా ఉంది. విక్రమ్ సేథ్ రచనల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ఎ సూటబుల్ బాయ్' నవలకు సీక్వెల్ గా 'ఎ సూటబుల్ గర్ల్' రాయాలనుకున్నారు. దీనికి ప్రచురణ కర్తలతో ఒప్పందం కుదిరింది. 1.7 మిలియన్ డాలర్లను అడ్వాన్స్ గా తీసుకున్నారు. 2013 చివరినాటికి ఆ నవల పూర్తి కావాలి. అయితే ఇటీవలే ఆ గడువును 2014-15 కి పెంచారు. అయితే ప్రచురణ కర్తలు ఇప్పుడీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో, విక్రమ్ సేథ్ ఏజెంట్లు ప్రచురణ కర్తలతో చర్చలు జరుపుతున్నారు. మరో ప్రక్క పెంగ్విన్-రాండమ్ హౌస్ ప్రచురణ సంస్ధల విలీన ప్రతిపాదన కూడా ఈ కాంట్రాక్టు రద్దుకు కారణమని తెలుస్తోంది.