: ఎన్నికల నేపథ్యంలో విజయమ్మ బహిరంగ లేఖ
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ప్రజలకు నేడు బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలపై తమదైన రీతిలో వ్యాఖ్యానించారు. 'ఈ స్థానిక ఎన్నికలు సంక్షేమాన్ని కోరుకునే శక్తులకు, వ్యతిరేకించే శక్తులకు మధ్య పోరు' అని ఆమె తన లేఖలో అభివర్ణించారు. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ పై ఆమె నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలు అభివృద్ధికి ప్రతిబంధకాలని పేర్కొంటూ, పన్నులతో ప్రజల నడ్డి విరగ్గొట్టడడమే వాటి పని అని విమర్శించారు. రాజశేఖరరెడ్డి పాలన సువర్ణమయమని.. అలాంటి దివ్యమైన పాలనకు ఈ ఎన్నికలు తొలిమెట్టు కావాలని విజయమ్మ పిలుపునిచ్చారు.