: భారత హాకీ కోచ్ పదవి ఊడింది
తన హాకీ చీఫ్ కోచ్ మైఖేల్ నాబ్స్ కి భారత్ స్వస్తి పలికింది. ప్రపంచ హాకీ లీగ్ లో భారత జట్టు పేలవ ప్రదర్శనే అందుకు కారణమని తెలుస్తోంది. జాతీయ పురుషుల జట్టుకు చీఫ్ కోచ్ గా నాబ్స్ 2011లో నియమితులయ్యారు. 2016 వరకూ అయన పదవీకాలం ఉంది. అయితే, జట్టు నుంచి ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో ఆయన విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనను హాకీ ఇండియా తొలగించక తప్పలేదు. దీంతో ఆస్ట్రేలియా కు చెందిన మైఖేల్ నాబ్స్ స్వదేశానికి వెళ్లనున్నారు. ఆసియా కప్ కోసం జూలై 16 నుంచి బెంగళూరులో ప్రారంభమయ్యే జాతీయ శిక్షణా శిబిరానికి రోలంట్ ఓట్స్ మన్ ఇన్ఛార్జీగా వ్యవహరించనున్నాడు. ఇతను డచ్ దేశీయుడు. మరో వైపు భారత జట్టుకు వెటరన్ ప్లేయర్లను కోచ్ లుగా నియమించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.