: పురందేశ్వరి, సుబ్బరామిరెడ్డిలకు 'చీర-సారె'


సమైక్యాంధ్ర విషయంలో స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చనందుకు నిరసనగా.. కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డిలకు సమైక్యాంధ్ర జేఏసీ 'చీర-సారె' పంపింది. పురందేశ్వరికి చీరను, సుబ్బిరామిరెడ్డికి సారెను పంపారు. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక తెలంగాణకే మొగ్గుచూపనుందన్న వార్తల నేపథ్యంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విశాఖలో సమావేశమైన జేఏసీ నేతలు.. పురందేశ్వరి, టీఎస్సార్ లకు 'చీర-సారె' పంపాలని తీర్మానించారు. అంతేగాకుండా, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఈనెల 12న తమ పదవులకు రాజీనామా చేయాలని జేఏసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News