: చైనాలో అవినీతి మంత్రికి మరణశిక్ష
చైనాలో అవినీతికి పాల్పడిన లియు ఝిజున్ అనే రైల్వేశాఖ మాజీ మంత్రికి ఉరిశిక్ష విధించారు. 2003 నుంచి 2011 వరకు మంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించిన లియు రూ.64 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తన వారికి దోచిపెట్టడంలో ఈయన ఉదారంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విచారణలో స్పష్టమైంది. అన్నింటికి మించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని తేలడంతో ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది. లియు కేసును విచారిస్తున్న బీజింగ్ కోర్టు తాజాగా ఆయనకు ఉరిశిక్ష విధించింది. అంతేగాకుండా రాజకీయ హక్కును జీవితాంతం రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. కాగా, చైనా చట్టాల ప్రకారం మరణశిక్ష ప్రకటించినప్పుడు దాని అమలును రెండేళ్ళు వాయిదావేస్తారు. ఆ వ్యవధి ముగిశాక సమీక్ష చేపడతారు.