: అంజలికి వారం రోజుల గడువు


విచారణకు పదేపదే డుమ్మా కొడుతున్న హీరోయిన్ అంజలి వ్యవహారంపై చెన్నై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. అంజలిని వారంరోజుల్లోగా కోర్టులో హాజరుపరచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశించింది. అంజలిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆమె పిన్ని భారతీదేవి దాఖలు చేసిన కేసుపై విచారణ జరుపుతున్న కోర్టు నేడు తాజా ఆదేశాలు జారీ చేసింది. అంజలిని హాజరుపరిచేందుకు మరికొంత గడువు కావాలని ప్రాసిక్యూటర్ కోరగా.. కోర్టు వారం రోజులు గడువిచ్చింది.

  • Loading...

More Telugu News