: కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుంది: డీఎస్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ లో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం నిజాయతీతో తీవ్రంగా ఆలోచిస్తోందని అన్నారు. రాయల తెలంగాణ అనేది కేవలం ఊహాగానమే తప్ప మరోటి కాదన్నారు. ఇంతవరకు అధిష్ఠానం పెద్దలెవరూ అలాంటి ప్రకటన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కొందరు మాత్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను సృష్టిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన కార్యకర్తలకు తెలిపారు.