: సారీ చెప్పిన జడేజా, రైనా
క్యాచ్ విషయంలో గొడవపడిన టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, సురేశ్ రైనా టీమ్ మేనేజ్ మెంట్ కు క్షమాపణలు తెలిపారు. ఈ వ్యవహారంలో బీసీసీఐ.. జడేజాను మందలించిన నేపథ్యంలో ఇరువురు క్రికెటర్లు టీమిండియా క్రికెట్ వ్యవహారాల మేనేజర్ ఎంవీ శ్రీధర్ తో మాట్లాడారు. విండీస్ తో మ్యాచ్ సందర్బంగా తమ ప్రవర్తన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాబోదని వారు హామీ ఇచ్చినట్టు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆ అధికారి అన్నారు.