: భజ్జీ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది: యువరాజ్ సింగ్
పంజాబ్ సహచరుడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చాలారోజుల తర్వాత జట్టులో చోటు దక్కించుకోవడం ఆనందం కలిగిస్తోందని స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ నెల 21న మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు జట్ల మధ్య పోరు అత్యంత రసవత్తరంగా సాగడం ఖాయమన్నాడు.
ఇక హర్భజన్ గురించి చెబుతూ, ఈ సిరీస్ తో భజ్జీ తన 100వ టెస్టు ఆడనుండడం గొప్ప విషయమన్నాడు. అతను గొప్ప బౌలరే కాదు, బ్యాటింగ్ లోనూ రాణిస్తాడని చెప్పాడు. హర్భజన్.. ఆసీస్ తో సిరీస్ లో తొలి రెండు టెస్టులకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మంచి అనుభవం ఉన్నసారథి అని యువీ కితాబిచ్చాడు. ఈ టెస్టు సిరీస్ కు యువరాజ్ ఎంపిక కాని సంగతి తెల్సిందే.