: అత్యాచారం చేసి ప్రియురాలిని బావిలోకి తోసేసిన ప్రియుడు
ప్రేమించానని ఊసులు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని బాసలు చేశాడు. ఆ ముచ్చట కాస్తా తీరాక బావిలో తోసేశాడు. కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లాలోని బాగేపల్లి గ్రామంలో ఓ ప్రియుడు, 20 ఏళ్ల యువతిని అత్యాచారం చేసి, అనంతరం ఆమెను బావిలో తోసేసి హత్యాయత్నం చేశాడు. బావిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఓ గొర్రెల కాపరి గుర్తించి స్థానికులకు సమాచారం అందించగా, వారు ఆమెను రక్షించి బాగేపల్లి తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. కాస్త కోలుకున్న తరువాత పుట్టపర్తి నుంచి వచ్చిన అడ్డప్ప అనే వ్యక్తి తనని ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పింది. దీంతో పోలీసులు అడ్డప్పపై కేసు నమోదు చేశారు.