: సార్వత్రిక సమ్మెతో నిలిచిపోయిన బ్యాంకింగ్ సేవలు


సార్వత్రిక సమ్మె బ్యాంకింగ్ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రెండ్రోజుల పాటు సమ్మెకు కార్మికులు పిలుపునిచ్చిన సందర్బంగా దేశవ్యాప్తంగా బ్యాంకు సిబ్బంది విధులను బహిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సిబ్బంది సమ్మెకు మద్దతు ప్రకటించడంతో సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్ కోఠిలో ఉన్న పలు బ్యాంకుల సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు.

తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలేదని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ.. బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగం పటిష్టమయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటేనే దేశ పురోగతి సాధ్యమని వివిధ బ్యాంకుల ప్రతినిధులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News